Saturday 22 November 2014

BhajaGovindam Telugu Lyrics


భజ గోవిన్దం, భజ గోవిన్దం
భజ గోవిన్దం మూఢమతే
సంప్రాప్తే సన్నిహిత కాలే
న హి న హి రక్షతి డుకృఞ్కరణే


ఓ మూఢమతీ! సృష్టికర్తయైన గోవిందును భజించు. నీకు అతి సన్నిహితంగా ఉండే మృత్యువు ఎప్పుడైనా నిన్ను కబళించగలదు.
 నువ్వు వల్లెవేస్తున్న ఈ ’డుకృఞ్కరణే’
 వ్యాకరణ పాఠాలేవీ నిన్ను రక్షించలేవు. ఇది గుర్తుంచుకో. సత్యాన్ని తెలుసుకునే ముక్తిమార్గం చూసుకో.

మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుధ్ధిం మనసి వితృష్ణం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం


ఓ మూఢుడా! ధన వ్యామోహాన్ని ఒదుల్చుకో. ఇంకా ఎంతో డబ్బు సంపాదించాలనే పేరాశను పెట్టుకోకు. సద్బుద్ధిని కలిగి,
నీకున్న ధనము నీ పూర్వ కర్మానుసారము లభించిందని, దానితో తృప్తి కలిగి ఉండు. మనస్సును ఇలా సమాధానపరచుకుంటే,
 ధనాశ నిన్నింక పీడించదు. ప్రశాంతత చేకూరుతుంది.

యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వారాం కో పిన పృచ్చతి గేయే


మనిషి ధనాన్ని సంపాదించే ఓపికతో ఉన్నంత కాలమే అతన్ని ప్రేమతో చూస్తారు. గౌరకార్యాలు చేసినా,
చివరికి జీవితం అంత్యదశ, ఇలా పరిణమిస్తుందని, వైరాగ్యాన్ని పెంపొందించడానికి,
శంకర భగవత్పాదులచే ఈ శ్లోకం చమత్కారంగా చెప్పబడింది. కేవలం ధన సంపాదన కోసమే జీవితమంతా గడిపివేసి,
విజ్ఞానహీనుడై వృధ్ధాప్యంలో ప్రవేశించిన ద్విపాద పశువులాంటి మనిషికి, ఎలాంటి విలువా వుండదని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.

మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్యా

ఓ మూఢ మానవుడా! నాకు ఎంతో ధనమున్నదని, ఎందరో బంధువులు,
బలగము ఉన్నారని, సుఖాలు అనుభవించడానికి యౌవ్వనం ఉందని గర్వపడిపోకు,
ఆ గర్వాన్ని విడిచిపెట్టు. నిముషంలో మృత్యువు వీటన్నింటినీ హరిస్తుంది. మృత్యు ముఖంలో పడగానే ఇవేవీ నీవెంట వచ్చేవి కావు.
 ఇవ్వన్నీ మాయామయమైన అసత్యపు భ్రాంతులు. వీటిని వదలి బ్రహ్మపదంలో ప్రవేశించు


సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః
సర్వ పరిగ్రహ భోగత్యాగః
కన్య సుఖం న కరోతి విరాగః



దేవాలయములవద్దనుండు చెట్లక్రింద నివసించుచు, నేలపై పవళించుచు,
 జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగియిండి, భోగముల నన్నిటిని త్యజించిన (వాడై చరించు)
వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలుగదు?



భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా
సకృదపి యేన మురారి సమర్చా
కియతే తస్య యమేన స చర్చా



భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను,
 గంగానదీ జలములోని ఒక బిందువైనా పానము చేసినను, ఒక్క్సారి యైనను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు!
అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు.

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయ పారే పాహి మురారే



మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు,
 తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నానాబాధలకు గురౌతున్న నన్ను ఓ మురారీ!
కృపతో సంసారము నుండి తరింపజేయుము.

గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం

 భగవద్గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును.
ఎల్లప్పుడును శ్రీపతి రూపముపై మనసు ధ్యానింపవలెను. ఎల్లప్పుడును సజ్జనులతో సహవాసము చేయవలెను.
 బీదలకు ధనము పంచిపెట్టవలెను.


అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం
పుత్రాదపి ధన ఖాజాం భీతిః
సర్వత్త్రేషా విహితా రీతిః

 ధనమెల్లప్పుడును అనర్థమునే కలిగించునని గ్రహించుము. ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు.
ఇది సత్యము. ధనవంతులు పుత్రునివలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా యిదే రీతిగానే యున్నది.

గురుచరణాంబుజ నిర్భర భక్తః
సఓసారాదచిరాద్భవ ముక్తః
సేంద్రియమానస నియమాదేవ
ద్రక్ష్యపి నిజ హృదయస్థం దేవం

No comments:

Post a Comment